హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ లైఫ్‌ టెక్‌ కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం

బిజినెస్ బిజినెస్

Posted by pallavi on 2024-09-13 19:50:19 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 78


హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ లైఫ్‌ టెక్‌ కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం

జర్మనీలో సీట్‌ బెల్ట్‌, ఎయిర్‌ బ్యాగులు మరియు ఇతర భద్రతా పరికరాలు తయారుచేసే జెడ్‌ఎఫ్‌ లైఫ్‌ టెక్‌ హైదరాబాద్‌లో తన కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ప్రారంభించింది. ఈ సెంటర్‌ను తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జెడ్‌ఎఫ్‌ ఈ జీసీసీని ప్రారంభించి తెలంగాణను ప్రపంచ స్థాయి సాంకేతికత మరియు నూతన పరిశోధనల కేంద్రంగా మార్చిందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ప్రస్తుతం 200 మందికి ఉద్యోగాలు లభించాయని, రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య 500 దాటుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రూడాల్ఫ్‌ స్టార్క్‌, ఇండియా ఈడీ రవికుమార్‌ పాల్గొన్నారు.

Search
Categories