Posted by pallavi on 2024-09-13 19:52:07 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 59
మూసీ నది నీటితో భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ కాలుషిత నీటి వినియోగం వల్ల క్యాన్సర్, నపుంసకత్వం, గర్భస్రావం వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పశువులు కూడా మరణిస్తున్నాయి. మూసీ నది నీటిలో ముక్కుపుటాలు మరియు ఇతర ఘాటు రసాయనాల వాసన వస్తోంది. జూలూరు కత్వ దగ్గర నీళ్లు దుంకేటప్పుడు ఏర్పడే గాలి నురగలు వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ దూరం వరకు వ్యాపిస్తున్నాయి. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత తీవ్రం అవుతూ నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల ప్రజల జీవితం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మూసీ నీటితో సాగించిన పంటలు మరియు కూరగాయలు మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు రవాణా చేస్తున్నాయి.