Posted by pallavi on 2024-09-13 20:20:32 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 75
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara) విడుదలకు సిద్ధమైంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతోందని తెలిసిందే. తాజాగా, ఎన్టీఆర్ డబ్బింగ్ (Jr NTR Dubbing) మరియు జాన్వీ కపూర్ స్టయిలింగ్ (Janhvi Kapoor Styling) పై కూడా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.