Posted by pallavi on 2024-09-13 20:24:10 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 80
శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో నటించిన ZEE5 ఒరిజినల్ చిత్రం ‘లవ్, సితార’ (Love Sitara) ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌తో పాటు సినిమా స్ట్రీమింగ్ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ‘లవ్, సితార’ అనేక భావోద్వేగాల కలయికగా రూపొందించిన ఈ కుటుంబ డ్రామా, ఓ కుటుంబంలో సభ్యుల మధ్య జరిగే వివిధ సమస్యలను, భావోద్వేగాలను వివరించడంతో పాటు, ప్రేక్షకులపై గాఢ ప్రభావం చూపిస్తుంది. రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్‌కు రానుంది.