జాతీయ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు స్విమ్మర్ల ప్రతిభ

క్రీడలు క్రీడలు

Posted by pallavi on 2024-09-13 20:31:32 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 73


జాతీయ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు స్విమ్మర్ల ప్రతిభ

జాతీయ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు స్విమ్మర్లు వ్రితి అగర్వాల్‌, సంపత్‌ కుమార్‌ యాదవ్‌ ప్రాబల్యం చూపిస్తున్నారు. మంగళూరులో జరుగుతున్న ఈ పోటీలలో, గురువారం హైదరాబాద్‌ స్విమ్మర్‌ వ్రితి ఒక స్వర్ణం, రజతం సాధించింది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో వ్రితి 9 నిమిషాలు 16.14 సెకన్లలో రేసును ముగించి స్వర్ణం సాధించగా, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో 2 నిమిషాలు 21.89 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతం పొందింది. విజయవాడ స్విమ్మర్‌ సంపత్‌ ఈ పోటీల్లో రెండో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సంపత్‌ 16 నిమిషాలు 26.48 సెకన్లలో రేసును ముగించి తృతీయ స్థానంలో నిలిచాడు.

Search
Categories