Posted by pallavi on 2024-09-13 20:33:39 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 68
అఫ్ఘానిస్థాన్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ నాలుగో రోజున ప్రారంభం కాలేదు. గురువారం ఉదయం వర్షం కురవడంతో అంపైర్లు ఆట రద్దు చేసే నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి జరగాల్సిన ఈ మ్యాచ్ వరుణుడి ప్రభావంతో టాస్ కూడా పడకపోవడం గమనార్హం. ఐదో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉండడంతో ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు టెస్టు చరిత్రలో కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఒక్క బంతి కూడా పడకుండా ముగిశాయి. 1998లో చివరిసారి భారత్-న్యూజిలాండ్ టెస్టు కూడా ఇలాగే రద్దైంది.