Posted by pallavi on 2024-09-13 20:47:37 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 62
**కేజ్రీవాల్ బెయిల్: న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలియజేసిన ఢిల్లీ సీఎం**లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఆప్ కార్యకర్తల సంబరాల నడుమ తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. జైలు నుండి విడుదలై కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూ, తన పోరాటం దేశం కోసం కొనసాగుతుందని, తన ఒంట్లోని ప్రతి రక్తం బొట్టు దేశం కోసమే వెచ్చిస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.