Posted by pallavi on 2024-09-13 21:15:13 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 45
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 5న న్యాయస్థానం విచారణ చేపట్టింది, మరియు శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు విధించిన షరతులు ఈ విధంగా ఉన్నాయి:
- రూ.10 లక్షల బాండ్ సమర్పించాలి
- కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదు
- కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలి
- ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదు
- అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయకూడదు