తెలంగాణలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్తత: ఎమ్మెల్యేలు పరస్పర సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి

తాజా వార్తలు తాజా వార్తలు

Posted by pallavi on 2024-09-13 21:18:14 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 75


తెలంగాణలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్తత: ఎమ్మెల్యేలు పరస్పర సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి

తెలంగాణలో రాజకీయాలు మరింత ఉధృతమయ్యాయి. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య ఘన రగడ ముదిరింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్​ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య పరస్పర సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఈ పరిస్థితిలో ఎప్పుడేమి జరుగుతుందో తెలియని టెన్షన్ నెలకొంది. 

ఈ నేపథ్యంలో, నేడు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నేతలు సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చని అనుమానించిన పోలీసులు, బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇళ్ల వద్ద పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తాను బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ను ఎంతో గౌరవిస్తానని స్పష్టం చేశారు. అయితే, పార్టీలో కోవర్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమికి కారణులైనట్టు కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

Search
Categories