కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వ కీలక నిర్ణయం: అక్టోబర్‌లో దరఖాస్తుల స్వీకరణ

తాజా వార్తలు తాజా వార్తలు

Posted by pallavi on 2024-09-13 21:19:31 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 48


కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వ కీలక నిర్ణయం: అక్టోబర్‌లో దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయంలో కొత్త కూటమి సర్కార్ పింఛన్ల కోసం అనేక కాలంగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. కొత్త పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకొని, అక్టోబర్ నెలలో అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మునుపటి ప్రభుత్వంలో రద్దైన పింఛన్లపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను సమీక్షించి, వాస్తవాలను గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లను మంజూరు చేసే ప్రణాళికలను రూపొందిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పొందుతుండగా, వీరిలో 8 లక్షల మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు.

Search
Categories