Posted by pallavi on 2024-09-13 21:20:40 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 44
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచేలా ప్రవర్తించారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు సమర్పించిన అనంతరం కాంగ్రెస్ మహిళా నేతలు మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయకపోతే సమాజంలో మహిళలు మరింత అవమానానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు చీర కట్టుకోవాలని, గాజులు తొడుక్కోవాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేత, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డికి ఒకటి చూపించాలనుకుంటున్నాం" అని చెప్పుతో హెచ్చరించారు.