Posted by pallavi on 2024-09-16 10:03:30 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 195
ఎన్టీఆర్ హయాంలో:
తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్, సమాజ సమానత్వం, అభ్యుదయ భావాలు, సంస్కరణలు వంటి అంశాలతో తెలంగాణ ప్రాంతంపై ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మునసబు, కరణాలు మరియు తెలంగాణలోని పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి గ్రామీణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించారు. బీసీ, దళితులను రాజకీయాల్లో ప్రోత్సహించి వారి అభివృద్ధికి దోహదపడ్డారు.
ఆదిలాబాద్ పర్యటనలో గిరిజనుల జీవన పరిస్థితులను గమనించిన ఎన్టీఆర్, గిరిజనులకు అటవీ హక్కులు కల్పిస్తూ 14 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, వలసలు ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పథకాలు అమలు చేసి కరవు సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులు కరవుని తరిమేయడంలో కీలకమైనవి.
హైదరాబాదులో ట్యాంక్‌బండ్ వద్ద సాహిత్య, సాంస్కృతిక మూర్తుల విగ్రహాల ఏర్పాటు, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కింద బుద్ధుని విగ్రహం ఏర్పాటు, నగరంలో రోడ్డు విస్తరణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఇమ్లిబన్ బస్ స్టేషన్ వంటి అభివృద్ధి పనులు ఎన్టీఆర్ హయాంలో నిర్వహించబడ్డాయి. 1985లో జారీ చేసిన 610 జీవో స్థానికులకు ఉద్యోగాల్లో న్యాయం కల్పించింది.
నారా చంద్రబాబు నాయుడు హయాంలో:
చంద్రబాబు హయాంలో హైదరాబాద్ ఐటీ, బయోటెక్, ఫైనాన్షియల్ రంగాల్లో అభివృద్ధి చెందింది. సైబరాబాద్, హైటెక్ సిటీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాలు చంద్రబాబు కాలంలో ఏర్పడ్డాయి. ఐఆర్డీఏను హైదరాబాద్‌కు తీసుకురావడం, బయోటెక్ హబ్‌గా నగరాన్ని తీర్చిదిద్దడం వంటి కృషి చేశారు.
హైదరాబాద్‌లో 19 ఫ్లై ఓవర్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపారు. క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు నిర్మించి, పుల్లెల గోపీచంద్ అకాడమీకి ప్రోత్సాహం ఇచ్చి క్రీడాకారుల ఎదుగుదలకు తోడ్పడ్డారు. శిల్పారామం, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్స్, జలవిహార్ వంటి విహార కేందాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యా, ఆరోగ్య రంగాల్లో అనేక సంస్థలు, ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలో ప్రారంభమయ్యాయి.