ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా

మీడియా వనరులు పత్రికా ప్రకటనలు

Posted by pallavi on 2024-09-16 11:16:16 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 72


ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా

కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ముఖ్య హామీలు

1. సంక్షేమ పథకాల విస్తరణ: లబ్ధిదారుల సంఖ్య పెంచి పథకాల పరిధిని విస్తరించనున్నారు.

2. అభివృద్ధికి ప్రాధాన్యం: రాష్ట్రం సమగ్ర అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా వ్యూహాత్మక ప్రణాళికలు.

3. బీసీల సంక్షేమం: వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక పథకాల అమలు.

4. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా: దేశంలో తొలిసారి ప్రతి కుటుంబానికి వైద్య భద్రతగా భారీ బీమా రక్షణ.

5. స్కిల్ సెన్సస్: రాష్ట్ర ప్రజల నైపుణ్యాలను అంచనా వేసేందుకు తొలిసారిగా స్కిల్ సెన్సస్‌ నిర్వహణ.

6. పింఛన్ పెంపు: నెలవారీ పింఛన్‌ను రూ.3 వేల నుండి రూ. 4 వేలకు పెంపు.

7. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్: ఈ వర్గాలకు 50 ఏళ్లకే నెలవారీ పింఛన్ అందించడం.

8. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు: స్కూలు విద్యార్థుల కోసం వార్షిక నగదు సాయం.

9. మహిళలకు నెలకు రూ.1500: ప్రతి మహిళకు నెలనెలా నగదు సాయం అందించడం.

10. చిన్న పరిశ్రమలకు సబ్సిడీ: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, స్టార్టప్‌లకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ.

11. మెగా డీఎస్సీ: ప్రతి ఏడాది ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల.

12. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు: స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల అందజేత.

13. సీపీఎస్‌పై పరిష్కారం: ఉద్యోగుల కష్టం దృష్టిలో పెట్టుకుని సీపీఎస్‌ సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం.

14. కాపు సంక్షేమం: ఐదేళ్లలో కాపు వర్గాల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు ఖర్చు.

15. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు: వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయడం.

16. కార్మికుల సంక్షేమం: డ్రైవర్లు మరియు అసంఘటిత రంగ కార్మికులకు చేయూత.

17. విద్యుత్, మద్యం ధరల నియంత్రణ: ప్రజలకు భారం తగ్గించేందుకు విద్యుత్‌, మద్యం ధరలను నియంత్రణలో ఉంచడం.

18. ఉచిత ఇసుక విధానం: ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ అమలు చేయడం.

19. దేవాలయాల ఆస్తుల రక్షణ: దేవాలయాల ఆస్తులు రక్షించడంతో పాటు బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు.

20. ముస్లిం మైనారిటీల, క్రిస్టియన్‌ల సంక్షేమం: ముస్లిం మైనారిటీలతో పాటు క్రిష్టియన్‌లకు పలు సంక్షేమ పథకాలు.

21. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి: ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు.

22. ఉద్యోగుల సంక్షేమం: ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు అర్హులైన తారీఖున చెల్లించే ప్రణాళిక.

23. బీసీల సంక్షేమం: బీసీ వర్గాల సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో రూ. 1.50 లక్షల కోట్ల ఖర్చు.


Search
Categories