Posted by admin on 2025-01-15 09:58:11 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 91
భారత గణతంత్ర దినోత్సవం: 26జనవరి 1950న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలననుండి స్వాతంత్ర్యం పొందింది. స్వాతంత్ర్యం పొందినప్పటికీ, అప్పట్లో దేశానికి రాజ్యాంగం లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టంఆధారంగా పాలన కొనసాగింది. 1947 ఆగస్టు28న రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రత్యేకంగా రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు.
రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనకు 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజుల సమయం పట్టింది. 308 మందిసభ్యులు రాజ్యాంగ సభలో చర్చలు జరిపి,దాదాపు 7,635 సవరణ ప్రతిపాదనలు అందుకున్నవారు.వీటిలో 2,473 సవరణలను పరిశీలించి, చర్చించి, ఆమోదించారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్26న ఆమోదం పొందిన తర్వాత 1950 జనవరి 24న 284 మంది సభ్యులు సంతకాలుచేసారు.
భారత రాజ్యాంగం 1950 జనవరి 26న ఉదయం 10:18 నిమిషాలకుఅమలులోకి వచ్చింది. ఈ రోజు, 26 జనవరి,1930లో భారత జాతీయ కాంగ్రెస్పూర్ణ స్వరాజ్య కోసం నిర్ణయం తీసుకున్నతేదీగా కూడా గుర్తించబడింది. ఈరోజుగణతంత్ర దినోత్సవంగా దేశవ్యాప్తంగా వేడుకలతో జరుపుకుంటారు.