Posted by pallavi on 2024-09-13 12:27:39 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 41
సమున్నతి, భారతదేశంలో అతిపెద్ద అగ్రి చైన్ ఎనేబులర్, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (NAFPO) తో కలిసి దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిన “భారత్ FPO ఫైండర్”ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్, దేశవ్యాప్తంగా ఉన్న 42,000 ఎఫ్ పీఓలను జాబితా చేసి, రైతులు, పరిశోధకులు, ఎన్జీఓలు, మరియు వాటాదారులకు వివిధ డేటా ఆధారిత సేవలను అందించడం ద్వారా, ఎఫ్ పీఓల ప్రాచుర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవా టెల్‌లో జరిగిన సమున్నతి 4వ జాతీయ సదస్సులో ఈ ఫైండర్ ప్రారంభించబడింది. ఈ సందర్భంగా సమున్నతి డైరెక్టర్ ప్రవేశ్ శర్మ మాట్లాడుతూ, "భారత్ ఎఫ్ పీఓ ఫైండర్” ను "ఎఫ్ పీఓల కోసం గూగుల్"గా పేర్కొన్నారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్, భారతదేశంలోని ఎఫ్ పీఓలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చి, ప్రాంతం, పంటలు, సేవలు, మార్కెట్ లింక్‌లు వంటి అనేక ప్రమాణాల ఆధారంగా శోధన సౌకర్యం కల్పిస్తుంది.
సమున్నతి వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అనిల్ కుమార్ ఎస్జీ మాట్లాడుతూ, ఈ ఫైండర్ వ్యవసాయ రంగంలో డిజిటల్ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎఫ్ పీఓలు చిన్న రైతుల ఉత్పత్తులను, మార్కెట్ యాక్సెస్ మరియు ఫైనాన్స్‌ను పెంచడంలో కీలకమైనవి కావున, ఈ ఫైండర్ వాటి వృద్ధికి తోడ్పడే వేదికగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంలో, అనిల్ కుమార్ ఎస్జీ "ఫైనాన్సింగ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ (CSA)" పై శ్వేతపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ పత్రం, భారత వ్యవసాయ రంగంలో వాతావరణ అనుకూల పద్ధతుల ఆర్థిక సహాయంపై వ్యూహాలను వివరిస్తుంది.
భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్, ఎఫ్ పీఓలు భారత వ్యవసాయ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించగలవని, రైతుల ఆర్థిక, పర్యావరణ శ్రేయస్సును పెంచే సామర్థ్యం వాటికి ఉందని పేర్కొన్నారు.
నాబార్డ్ సీజీఎం డాక్టర్ ఏవీ భవానీ శంకర్, సమున్నతి యొక్క ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, ఎఫ్ పీఓలను మార్కెట్‌కు అనుసంధానించడం ద్వారా వాటిని శక్తివంతం చేయడం, సుస్థిర వ్యవసాయ విధానాలకు మద్దతుగా ఉండటం ముఖ్యమని అన్నారు.