Posted by pallavi on 2024-09-13 12:45:06 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 27
హైదరాబాద్, సెప్టెంబర్: వీ సతీష్ కుమార్ ఈ రోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 2021 నుంచి మార్కెటింగ్ విభాగంలో డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఆయన, ఇప్పుడు ఛైర్మన్ హోదాలో కూడా పనిచేస్తున్నారు. గతంలో అక్టోబర్ 2022 నుంచి ఒక సంవత్సరంపాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
35 ఏళ్ల కెరీర్‌లో సతీష్ కుమార్ దేశవ్యాప్తంగా పలు కీలక పదవులను చేపట్టారు. ఆయన ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్ (మలేషియా) మరియు ఇండియన్ ఆయిల్ మారిషస్ లిమిటెడ్ సంస్థల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
డైరెక్టర్ (మార్కెటింగ్) హోదాలో, ఆయన ప్రకృతి వైపరీత్యాలు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పెట్రోలియం ఉత్పత్తుల నిరంతర సరఫరాను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో ఇండియన్ ఆయిల్ అనేక ప్రధాన ప్రాజెక్టులు చేపట్టి, తన రిటైల్ అవుట్‌లెట్‌లను ఆధునీకరించడం, కొత్త బాట్లింగ్ ప్లాంట్లు, టెర్మినల్స్ స్థాపించడం వంటి చర్యలను చేపట్టింది.
ఇక ఉత్పత్తుల పరంగా, కంపెనీ అధిక ఆక్టేన్ ఇంధనాలు, గ్రీన్ కాంబో లూబ్రికెంట్లు, కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్లు, 25 కిలోల బిటుమెన్ ప్యాక్స్ వంటి వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా ఇథనాల్ 100, ఏవీ గ్యాస్ 100 ఎల్ఎల్, మిథనాల్ మిశ్రమ డీజిల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను విక్రయించే ఏకైక చమురు కంపెనీగా ఇండియన్ ఆయిల్ నిలిచింది.
భారతదేశంలో ప్రీమియర్ ఆయిల్, గ్యాస్ రిటైలర్‌గా ఇండియన్ ఆయిల్ స్థానాన్ని కొనసాగించడానికి ఆయన వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించారు. ఇంతేకాక, సతీష్ కుమార్ మార్పుల కారణంగా 2023లో ఇండియన్ ఆయిల్ బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్‌లో 9వ ర్యాంక్‌ను, ప్రపంచవ్యాప్తంగా టాప్ ఆయిల్, గ్యాస్ కంపెనీలలో 3వ ర్యాంక్‌ను సాధించింది.
మార్కెటింగ్ డైరెక్టర్‌గా నియామకానికి ముందు, సతీష్ కుమార్ మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాష్ట్ర అధిపతిగా ఉన్నారు. ఈ సమయంలో, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలులో కీలక పాత్ర పోషించారు.
సతీష్ కుమార్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ సాధించారు మరియు స్లోవేనియాలోని లుబ్జానా విశ్వవిద్యాలయం నుండి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు.