Posted by pallavi on 2024-09-13 19:59:48 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 66
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక అసమానతలు, అంతరాలు పెరుగుతున్నాయి. కార్పొరేట్ సంస్థల యజమానులు వేల కోట్ల రూపాయల ఖర్చుతో వివాహాలు, సంబరాలు విదేశాల్లో నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం బిలియనీర్ల మరియు కుబేరుల సంఖ్య శరవేగంగా పెరుగుతుంది.
మన ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా కార్పొరేటీకరించడం ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల వేతనాల నియంత్రణ, కుదింపు, పని గంటల పెంపు వంటి చర్యలకు సహకరిస్తూ, కార్పొరేట్ సంస్థల లాభాలపై పన్ను శాతం తగ్గిస్తూ వారి లాభాలను పెంచుతోంది. లాభాల వెల్లువను, పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను కార్పొరేటీకరించడం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఆర్థిక వృద్ధిరేటు ఆరు శాతం, ఉపాధి–ఉద్యోగిత రేటు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఉద్యోగ లభ్యత లేకుండా అభివృద్ధి జరుగుతోంది. ఈ పరిస్థితి మధ్య, దిగువ స్థాయి కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారుతూ, ప్రభుత్వం దీనిని పట్టించుకోవడం లేదు.