Posted by pallavi on 2024-09-13 21:05:33 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 74
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలు కారణంగా వచ్చిన అపార నష్టంపై ఆయన పూర్తి వివరాలు అందించనున్నారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను కూడా కేంద్ర మంత్రికి వివరించబోతున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని, గ్రామీణ, మండల, జిల్లా స్థాయి రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్న పరిస్థితులను వివరిస్తారు.
గత ప్రభుత్వమిచ్చిన పరిహారాన్ని పెంచే విషయాన్ని, మృతుల కుటుంబాలకు కేంద్రం సహాయం అందించాలన్న అభ్యర్థనను కూడా కేంద్ర మంత్రికి తెలియజేయనున్నారు. సుమారు రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమికంగా నివేదించారు. వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 2న ప్రధానికి లేఖ రాశారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించేందుకు ప్రధాని మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్‌మెంట్ కోరారు. మరోవైపు, పీసీసీ కార్యవర్గం మరియు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు.