గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యం

మీడియా వనరులు పత్రికా ప్రకటనలు

Posted by pallavi on 2024-09-16 11:19:41 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 100


గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రాధాన్యం

విజయవాడ (చైతన్య రథం): గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం ఆయన గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారి మరియు విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసును ప్రారంభించిన తరువాత మాట్లాడుతూ, గత మూడు నెలల్లో నాలుగు కొత్త సర్వీసులను ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రస్తుతం షార్జాకు సర్వీసులు అందుబాటులో ఉండగా, త్వరలోనే దుబాయ్ మరియు సింగపూర్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటి పెంచడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణెకు కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపారు.

విస్తరణ పనుల సమీక్ష
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అధికారులు మరియు ఇతర ప్రముఖులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రివర్యులు 2025 జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు 52% పనులు మాత్రమే పూర్తయినందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిధులు, మెటీరియల్ కొరతలు లేవని, ఆలస్యం గల కారణాలపై విచారణ జరిపారు. వర్షాల కారణంగా పనులు మందగించినప్పటికీ, వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సూచించారు.

పనుల పురోగతిపై వాట్సాప్ గ్రూప్
విమానాశ్రయ అభివృద్ధి పనులకు సంబంధించిన పురోగతిని ప్రోత్సహించేందుకు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ప్రతి రోజు పురోగతిని పోస్టు చేయాలని, నెలకోసారి క్రమం తప్పకుండా సమీక్ష చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Search
Categories